వడ్లు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి అన్నారు. పండిన పంటను నిల్వచేసే పరిస్థితి రైతుల దగ్గర లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. రైతుల జీవితాలతో టీఆర్‌ఎస్, బీజేపీ చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చేసిన సంతకం రైతుల పాలిట మరణశాసనంగా మారిందని రేవంత్ పేర్కొన్నారు. బాయిల్డ్ రైస్ సరఫరా చేయబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం గుదిబండగా మారిందని తెలిపారు. రైతులను మోసం చేయడానికి సమస్యను జఠిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్లను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement