Saturday, November 23, 2024

Revanth reddy: మంత్రి కేటీఆర్‌కి తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా?

హైదరాబాద్ షేక్‌పేటలోని సర్వే నంబరు 327లో 30 ఎకరాలకుపైగా ఉన్న‌ ప్ర‌భుత్వ భూమిలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వచ్చిన క‌థ‌నాన్ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సర్వే నంబరు 327లోనిది తమ భూమే అని ప్రభుత్వం కోర్టుల్లో వాదిస్తోందని, అయితే ఇప్పుడు తుది తీర్పునకు లోబడే తాము ఆ భూముల‌కు సంబంధించిన‌ విష‌యాల్లో ముందుకు వెళ్తున్నామంటూ షరతుతో ప్రైవేటు వ్యక్తులకు జీహెచ్‌ఎంసీ తుది లే అవుట్‌ అనుమతులు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆయా అంశాల‌ను ప్రస్తావిస్తూ తెలంగాణ స‌ర్కారుపై రేవంత్ రెడ్డి ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. 

‘నగరం నడిబొడ్డున రూ.2000 కోట్ల దోపిడీ వెనుక ఉన్న ముఠా నాయకుడు ఎవరు? మునిసిపల్ మంత్రి 
కేటీఆర్‌కి తెలియకుండా ఈ దోపిడీ సాధ్యమా? తెలంగాణ ముఖ్య‌మంత్రి ఆదేశాలు లేకుండా సీఎస్, మునిసిపల్ కమిషనర్ లు ఇంతలా బరితెగించగలరా? సర్వే నంబర్ 327లో లే అవుట్ అనుమతులు రద్దు చేయాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement