Saturday, November 23, 2024

నిజాం దారుల్లో కేసీఆర్.. తాగుబోతుల అడ్డా ఇదీ

టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నిజాం నవాబు దారుల్లో నడుస్తున్నారని ఆరోపించారు. ఆదివారం హుజురాబాద్ ఎన్నిన ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతారని మండిపడ్డారు. ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని విమర్శించారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడన్న టీఆర్‌ఎస్‌ నేతలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రులు హరీశ్‌రావుది సిద్ధిపేట కాదని, కేటీఆర్‌ ది సిరిసిల్ల కాదని.. వారు కూడా స్థానికేతరులనేని గుర్తు చేశారు. స్థానికేతరులైన కేటీఆర్‌, హరీశ్‌రావులకు ప్రజలు అవకాశం ఇస్తే విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందన్న రేవంత్.. హుజురాబాద్‌ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ ను గెలిపించి కేసీఆర్‌ తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచారు. బల్మూరి వెంకట్‌ ఐదు సంవత్సరాలు విద్యార్థి నాయకుడిగా ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన మోసంపై బల్మూరి వెంటక్ పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఇంటికో ఓటు కాంగ్రెస్‌ పార్టీకి వేసి బల్మూరి వెంకట్‌ ను గెలిపించాలని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ లోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ 15 మంది ఎవరు?

Advertisement

తాజా వార్తలు

Advertisement