Monday, November 25, 2024

Revanth Reddy: ధరణి వల్లే భూ హత్యలు.. బీహారీలపై ప్రేమ ఎందుకు?

తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ అధికారులను గుప్పిట్లో ఉంచుకుని రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని కీలక శాఖ ఐఏఎస్ అధికారులు బీహార్ రాష్ట్రానికి చెందినవారే ఉన్నారని తెలిపారు. ఇది తెలంగాణ అధికారులకు అవమనకరం అని అన్నారు. అందుకే ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా రాజీనామా చేశారని చెప్పారు. సంజయ్ కుమార్ ఝా అనే బీహార్ మంత్రి ట్విట్టర్ తనను తీవ్రంగా విమర్శిస్తున్నారన్న రేవంత్.. కేసీఆర్ తరుపున బీహార్ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 157 మంది ఐఏఎస్ లలో ప్రతిభ కలిగిన వారు లేరా..? అని ప్రశ్నించారు. అర్హత లేకున్నా సోమేశ్ కుమార్ కు సీఎస్ హోదా కట్టబెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రయివేటు కంపనీలలో పని చేసిన వ్యక్తి సోమేశ్ కుమార్ వ్యాఖ్యానించారు. 31 సంవత్సరాల సర్వీసులో ఏడున్నర సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులో లేరన్నారు.

సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్ కలిసి భూ సంస్కరణలు పేరుతో ధరణి పోర్టల్ తెచ్చారని పేర్కొన్నారు. ధరణి వల్ల పదులు సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయని అన్నారు.  ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను కాల్చి చంపారని గుర్తు చేశారు. ధరణి పోర్టల్ లో తప్పుడుగా నమోదు కావడం వల్ల 20 సంవత్సరాల క్రితం అమ్మిన భూ యజమాని పెరు మీద పాస్ బుక్కులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం తప్పుడు నిర్ణయం వల్లే హత్యలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది ఎకరాల భూముల గోల్ మాల్ జరిగిందని ఆరోపించారు. నిన్న జరిగిన భూ హత్యలు ధరణి పోర్టల్ పాత్ర,సోమేశ్ కుమార్ నిర్ణయాలు వల్లే జరిగిందని ఆరోపించారు. బిహారీ గ్యాంగ్ పాత్ర ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement