హుజురాబాద్ ఎన్నికల తర్వాత టీఆరెఎస్ లో చాలా మార్పులోస్తాయని, పార్టీలో తిరుగుబాటు తప్పదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన సీఎల్పీలో మీడియా తో చిట్ చాట్ లో అనేక అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఉండవు అన్న అంశాలను ప్రస్తావిస్తూ టిఆర్ఎస్ లో హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తిరుగుబాటు తప్పదని అన్నారు. విజయ గర్జన సభను కేసీఆర్ ప్రకటించడం వెనుక రాబోయే తిరుగుబాటును ఎదుర్కోడానికే నని ఆయన పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో కేసీఆర్ భయంతోనే వున్నారని అది బయటపడకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పారు.
ముందస్తు ఎన్నికలు రావాని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదంగా వుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కలిసి రావని, 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఆయన వివరించారు. విజయ గర్జన సభలు కేసీఆర్ భయంతోనే పెడ్తుండని ఇవే టీఆరెఎస్ పార్టీకి చివరి సభలు అవుతాయని జోస్యం చెప్పారు.
హరీష్ రావును కూడా కేసీఆర్ త్వరలో పార్టీ నుండి బయటికి పంపుతాడని వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటెల గెలిచిన ఓడిన ఎవరికి లాభం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుజరాత్ తోనే తెలంగాణలో ఎన్నికలు వస్తాయి రేవంత్ అన్నారు. 2022 ఆగస్ట్ 15 తో స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని, దీంతో కొత్త శకానికి నాంది అని కేసీఆర్.. ఎన్నికలకు వెళ్తారని రేవంత్ రెడ్డి చెప్పారు. మోడీ డైరెక్షన్ లో కేసీఆర్ గుజరాత్ ఎన్నికలతో కలిసి ముందస్తూ ఎన్నికలలో వెళ్తారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బిజేపిని బలోపేతం చేసే కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఇప్పుడే ముందస్తు ఎన్నికలు అంటూ హడావీడి చేస్తే.. తన పార్టీలో మరింత గందరగోళం వస్తుందని కేసీఆర్ చెప్పడం లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులకు టికెట్ల ఇచ్చే పరిస్థితి లేదన్న రేవంత్.. వారిని ముందస్తుగానే అలర్ట్ కాకుండా ఈ డ్రామా ఆడుతున్నడని ఆరోపించారు. ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ ను ఎవరు అడిగారన్న రేవంత్.. ఇప్పుడు ముందస్తు ఎన్నికల విషయం ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మరో రెండేళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని చెప్పుకోవడం కోసమే ఈ ముందస్తు ఉండదని చెబుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఏం అభివృద్ధి, సంక్షేమం సాధించారని విజయ గర్జన సభ నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో ఎంపీలు 16 గెలుస్తామని.. కేంద్రంలో చక్రం తిప్పుతామని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. టీఆరెఎస్ మ్యానిఫెస్టోలో దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దళితులకు ముడేకరాల భూమి ఇస్తా అని కేసీఆర్.. మోసం చేశారని మండిపడ్డారు. దళిత బంధు కూడా అడగలేదన్నారు. ప్రధాని మోదీని పలు సార్లు కలిసి కేసీఆర్.. వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించారా? అని నిలదీశారు. కేసీఆర్..దళిత ద్రోహి అని రేవంత్ రెడ్డి విమర్శించారు.