Tuesday, November 26, 2024

తెలంగాణ సాధనలో ఆ ముగ్గురు మహిళలు: రేవంత్

సమాజాభివృద్దిలో మహిళల ప్రాధాన్యత మరువలేనిదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా దినోత్సవం వేడుకలలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అత్యున్నత చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముగ్గురు మహిళల ప్రాధాన్యత ఉందన్న రేవంత్.. సోనియా గాంధీ, సూష్మ స్వరాజ్ , మీరాకుమార్ వల్లే తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర సాధనలో మహిళల పాత్ర మరువలేనిదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో మహిళలకు పెద్ద పీట వేస్తూ ఆరుగురు మంత్రులకు అవకాశం కల్పించిందని చెప్పారు. కాంగ్రెస్ కు ఎప్పుడు అవకాశం వచ్చినా.. మహిళలకు పెద్దపీట వేసిందని తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కోసం సోనియా గాంధీ బిల్లు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నాలను.. మోదీ తొక్కిపెట్టారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో మహిళా రిజర్వేషన్ తీసుకాస్తాం అని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురు మంత్రులకు అవకాశం ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement