రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల నుంచి చేవెళ్లలోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు పది కిలోమీటర్ల మేర టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రని చేపట్టారు. నిత్యావసర వస్తువుల ధరలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్రను చేపట్టింది. నిత్యావసర ధరలు తగ్గేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కాగా ఈ పాదయాత్రను ముడిమ్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పాదయాత్రలో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొనడం విశేషం. పాదయాత్ర ముగిసిన తర్వాత బహిరంగసభలో రేవంత్, దిగ్విజయ్ సింగ్ ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్రని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..