Sunday, November 24, 2024

Revanth Reddy: సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్

రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ పై చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను చేసిన ఫిర్యాదుకు ఇవాళ్టి ఉదయం వరకు పోలీసులు అధికారులు FIR చేయలేదన్నారు. FIRలో నమోదు చేసిన సెక్షన్స్ సంతృప్తి కరంగా లేవన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్స్ వల్ల తన ఫిర్యాదు నిరుగారిపోతోందన్నారు. సెక్షన్స్ సంతృప్తికరంగా లేవు కాబట్టే మళ్ళీ ఫిర్యాదు చేశానని చెప్పారు. మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ లో బలమైన సెక్షన్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వల్ల తాను చేసిన ఫిర్యాదు రూపమే మారిపోతుందన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ చూస్తే.. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషేంట్ డెడ్ లాగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వత్తిడి మేరకు ఇలాంటి నామమాత్రంగా కేసులు నమోదు చేశారని అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.  మహిళలను అత్యంత నీచంగా కించపరిచే విదంగా మాట్లాడిన హిమంత్ పైన బలమైన కేసులు నమోదు చెయాలన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకోని అస్సాం ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు కేసును నిరుగారిస్తే, న్యాయస్థానంలో కొట్లాడుతాం అని చెప్పారు.

వందలాది మంది పిల్లలు ఉద్యోగాలు లేక మృత్యువాత పడుతుంటే- కేసీఆర్ పిల్లలు మాత్రం కేసీఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులు జరుపుతున్నారని మండిపడ్డారు. కరోనాతో సమాజం అంతా దుఃఖంలో ఉంటే మూడు రోజులు జన్మదిన వేడుకలు ఎలా చేసుకుంటారు? అని ప్రశ్నించారు.  ఈ నెల 17వ తేదీన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గాడిదకు జన్మదిన వేడుకలు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా లక్ష నోటిఫికేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోడీకి యూపీలో మేలు చేయడానికే కేసీఆర్ సుపారి తీసుకోని మాట్లాడుతున్నారని ఆరోపించారు. మూడో కూటమి వస్తే యూపీఏ కూటమి బలహీనపడి- ఎన్డీఏ కూటమి బలపడుతుందని అభిప్రాయపడ్డారు. మోడీ నుంచి సుపారి తీసుకున్న సుపారి గ్యాంగ్ లీడర్ కేసీఆర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ తో ఉన్న కూటములను చీల్చడానికే కేసీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దేశం- తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement