టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అయితే గుర్నాథ్ రెడ్డి ఆదివారం కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. కొండగల్‌కు చెందిన గుర్నాథ్ రెడ్డి గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో గురునాథ్ రెడ్డికి ఎప్పటినుంచో విబేధాలు కొనసాగుతోన్నాయి. ఇరువురి మధ్య ఆధిపత్య, వర్గ పోరు నడుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయనను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని రేవంత్ భావించారు. గతంలో కూడా గుర్నాథ్ రెడ్డితో రేవంత్ సమావేశమయ్యారు. ఇదిలా ఉంటే.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 21 తర్వాత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత సంపత్ కుమార్‌తో జూపల్లి మంతనాలు జరిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కొదండరామ్ కూడా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే అంశంపై సంపత్ కుమార్‌తో కొదండరామ్ చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది.