– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఈ ప్రయోగంలో భాగంగా.. రీ యూజబుల్ లాంచ్ వేహికల్ (RLV) వింగ్ బాడీని హెలికాప్టర్ ఉపయోగించి మూడు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. రన్‌వే మీద 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో దీన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఈ వేహికల్ గాల్లోకి ఎగురుతుంది. ఈ క్రమంలోనే కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత దానికదే.. కిందికి వచ్చి రన్‌వే వైపు నావిగేట్ అవుతుంది. ఇదంతా చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్ లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా అటానమస్‌గా (దానికదే ఓపెన్ అయ్యే) ఉన్న ల్యాండింగ్ గేర్ సిస్టమ్‌తో ఈ వేహికల్ ల్యాండ్ ఆయ్యేలా ప్రయత్నాలు జరుగతున్నాయి.
ల్యాండింగ్ గేర్, పారాచూట్, హుక్ బీమ్ అసెంబ్లీ, రాడార్ ఆల్టిమీటర్, సూడోలైట్ వంటి కొత్త వ్యవస్థలను డెవలప్ చేసి ఈ రీయూజబుల్ లంచ్ వేహికల్ సక్సెస్ అయ్యేలా చూస్తామని ఇస్రో అధికారులు అంటున్నారు. కాగా, ISRO తన తొలి RLV-TD HEX-01 (హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్ పెరిమెంట్-01) మిషన్‌ను 2016, మే 23న ఏపీలోని నెల్లూరు జిల్లా షార్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇక.. రీ-ఎంట్రీ వాహనాల రూపకల్పన.. విమాన పరీక్షల కోసం క్లిష్టమైన టెక్నాలజీని సైతం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించింది. అయితే, ఇది సబార్బిటల్ ఫ్లైట్ కాగా, దీన్ని సముద్రం మీద ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
ఇక.. RLV-LEX మిషన్‌లో ప్రదర్శించాల్సిన క్లిష్టమైన టెక్నాలజీలో ఒకటి రన్‌వేపై అప్రోచ్, అటానమస్ ల్యాండింగ్ అన్న విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎండ్-టు-ఎండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వి) టెక్నికల్ ఎఫియన్సీని పొందాలంటే, ఆర్‌ఎల్‌వి ఓఆర్‌ఇ (ఆర్బిటల్ రీ-ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్) మిషన్‌కు ముందు ఈ మైలురాయిని (ఆర్‌ఎల్‌వి-లెక్స్) సాధించాల్సి ఉంటుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు.
ఇదంతా జీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ లాంచ్ వేహికల్ దశల నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లి ఆర్బిటార్‌లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత.. మళ్లీ ఆర్బిటల్ రీ-ఎంట్రీ వెహికల్ (ORV) అని పిలిచే ఒక వింగ్ బాడీ నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ఉండి, మళ్లీ లాంచ్ వేహికల్లోకి ప్రవేశించి భూమికి చేరుకుని రన్‌వేలో ల్యాండ్ అవుతుంది. ఈ క్రమంలో దీనికి అమర్చిన ల్యాండింగ్ గేర్ సిస్టమ్ అనేది దానికదే అటానమస్‌గా వర్క్ చేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ సఫలీకృతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో ఇండియా టాప్ వన్‌లో నిలుస్తుందని సైంటిస్టులు అంటున్నారు.