Friday, November 22, 2024

Spl Story: అంతరిక్ష ప్రయోగాలకు రీయూజబుల్​ రాకెట్.. సక్సెస్​ అయితే ఇస్రో మరో కొత్త చరిత్ర!

భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. ఇండియన్​ మేడ్​ రీ యూజబుల్​ రాకెట్​తోపాటు.. రన్​వే ల్యాండింగ్​ సిస్టమ్​ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేపట్టింది. దీనికోసం కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాలో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి మేడ్-ఇన్-ఇండియా రీయూజబుల్ లాంచ్ వెహికల్ – టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్ (RLV-TD) కి చెందిన మొదటి రన్‌వే ల్యాండింగ్ ప్రయోగానికి (RLV-LEX) ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం ఇస్రో చైర్మన్ సోమనాథ్  టెస్ట్​ వేమికల్​ ప్రయోగానికి కావాల్సిన వాతావరణాన్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఈ ప్రయోగంలో భాగంగా.. రీ యూజబుల్​ లాంచ్​ వేహికల్​ (RLV) వింగ్ బాడీని హెలికాప్టర్ ఉపయోగించి మూడు నుండి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళతారు. రన్‌వే మీద 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో సమాంతర వేగంతో దీన్ని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఈ వేహికల్​ గాల్లోకి ఎగురుతుంది. ఈ క్రమంలోనే కొంత ఎత్తుకు వెళ్లిన తర్వాత దానికదే.. కిందికి వచ్చి రన్‌వే వైపు నావిగేట్ అవుతుంది. ఇదంతా చిత్రదుర్గ సమీపంలోని డిఫెన్స్ ఎయిర్‌ఫీల్డ్ లో నిర్వహించనున్నారు. అంతేకాకుండా అటానమస్​గా (దానికదే ఓపెన్​ అయ్యే​) ఉన్న ల్యాండింగ్ గేర్‌ సిస్టమ్​తో ఈ వేహికల్​ ల్యాండ్ ఆయ్యేలా ప్రయత్నాలు జరుగతున్నాయి.

ల్యాండింగ్ గేర్, పారాచూట్, హుక్ బీమ్ అసెంబ్లీ, రాడార్ ఆల్టిమీటర్, సూడోలైట్ వంటి కొత్త వ్యవస్థలను డెవలప్​ చేసి ఈ రీయూజబుల్​ లంచ్​ వేహికల్​ సక్సెస్​ అయ్యేలా చూస్తామని ఇస్రో అధికారులు అంటున్నారు.  కాగా, ISRO తన తొలి RLV-TD HEX-01 (హైపర్సోనిక్ ఫ్లైట్ ఎక్స్ పెరిమెంట్-01) మిషన్‌ను 2016,  మే 23న ఏపీలోని నెల్లూరు జిల్లా షార్​ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించింది. ఇక.. రీ-ఎంట్రీ వాహనాల రూపకల్పన.. విమాన పరీక్షల కోసం క్లిష్టమైన టెక్నాలజీని సైతం సక్సెస్​ఫుల్​గా ప్రదర్శించింది. అయితే, ఇది సబార్బిటల్ ఫ్లైట్ కాగా, దీన్ని సముద్రం మీద ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.

ఇక.. RLV-LEX మిషన్‌లో ప్రదర్శించాల్సిన క్లిష్టమైన టెక్నాలజీలో ఒకటి రన్‌వేపై అప్రోచ్, అటానమస్ ల్యాండింగ్ అన్న విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఎండ్-టు-ఎండ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ (ఆర్‌ఎల్‌వి) టెక్నికల్​ ఎఫియన్సీని పొందాలంటే, ఆర్‌ఎల్‌వి ఓఆర్‌ఇ (ఆర్బిటల్ రీ-ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్) మిషన్‌కు ముందు ఈ మైలురాయిని (ఆర్‌ఎల్‌వి-లెక్స్) సాధించాల్సి ఉంటుందని ఇస్రో అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇదంతా జీఎస్​ఎల్​వీ, పీఎస్​ఎల్​వీ లాంచ్​ వేహికల్​ దశల నుంచి వచ్చిన మరో కొత్త ప్రయోగంగా చెప్పుకోవచ్చు. రాకెట్​ అంతరిక్షంలోకి వెళ్లి ఆర్బిటార్​లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత.. మళ్లీ ఆర్బిటల్ రీ-ఎంట్రీ వెహికల్ (ORV) అని పిలిచే ఒక వింగ్ బాడీ నిర్ణీత వ్యవధిలో కక్ష్యలో ఉండి, మళ్లీ లాంచ్​ వేహికల్​లోకి ప్రవేశించి భూమికి చేరుకుని రన్‌వేలో ల్యాండ్ అవుతుంది. ఈ క్రమంలో దీనికి అమర్చిన ల్యాండింగ్ గేర్‌ సిస్టమ్ అనేది దానికదే​ అటానమస్​గా వర్క్​ చేస్తుంది. ఈ ప్రయోగాలన్నీ సఫలీకృతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో ఇండియా టాప్​ వన్​లో నిలుస్తుందని సైంటిస్టులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement