జనగామ జిల్లాలో భూ మాఫియా చేసిన దారుణం బయటపడింది. ఓ భూమి వివాదం విషయంలో పూర్తి ఆధారాల కోసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేశాడన్న కారణంగా రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య మర్డర్‌కి స్కెచ్ వేశారు. కాగా, అతడిని తొలుత కిడ్నాప్ చేసి, మర్డర్ చేసిన సుపారీ గ్యాంగ్‌ని పోలీసులు పట్టుకున్నారు. ఈ గ్యాంగ్‌లో నలుగురు ఉన్నారని, అందులో ముగ్గురు నిందితులను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరో ఇద్దరి కోసం సెర్చ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా, ఈ మర్డర్‌కు సుపారీ ఇచ్చిన అంజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. 8 లక్షల రూపాయలకు సుపారి మాట్లాడి, 50 వేల రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. హత్యకు భూ వివాదమే కారణమని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.