హైదరాబాద్ షాబాద్ : ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో హైడ్రామా నడుమ సోదాలు నిర్వహించారు. విచారణ సందర్భంగా ఉద్వేగానికి గురైన లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆయనను ఆసుపత్రికి తరలించారు. దాదాపు పది గంటల పాటు సోదాలు చేసిన సీఐడీ అధికారులు.. తిరిగి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ నైఫుణ్యాభివృద్ధి సంస్థ చేపట్టిన సీమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి రూ.241 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలపై.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణతో పాటు మరి కొందరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన ఇంట్లో సోదాలు చేశారు. అదే సమయంలో.. టిడిపి అధినేత చంద్రబాబు హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..