తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కట్టడికి ఆంక్షలు విధించింది తెలంగాణ సర్కార్. హైకోర్టు ఆదేశాలతో ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. నేటి నుంచి జనవరి 2వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. జనవరి 2వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని తెలిపింది. పబ్లిక్ ఈవెంట్లలో భౌతిక దూరాన్ని తప్పని సరి చేసింది. ఓమిక్రాన్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సర్కార్ సూచిస్తోంది.ఇటీవల ఓమిక్రాన్, కరోనా పరిస్థితులపై హైకోర్టు లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జనాలు గుమికూడకుండా.. పండగల సమయంలో కఠిన ఆంక్షలు విధించాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది.ఇప్పటికే మధ్య ప్రదేశ్, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఓడిశా, హర్యానా రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించాయి. నైట్ కర్ప్యూలు విధిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..