కొన్ని సినిమాలు పెద్దలకు మాత్రమే అని బోర్డు ఉంటుంది..అలాగే ఓ రెస్టారెంట్ లో పిల్లలకి ప్రవేశం లేదని బోర్టు పెట్టారు..అది కూడా ఐదు సంవత్సరాల లోపు పిల్లలకే ఈ కండిషన్ వర్తిస్తుంది. పిల్లలంటేనే అల్లరి అని అర్థం..కుదురుగా ఒకచోట కూర్చొరు..కొత్తగా ఏం కనిపించినా దాన్ని పాడు చేసే వరకు వారికి నిద్ర పట్టదు. అందుకే ఈ కండిషన్ పెట్టారట..మరి ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసా.. బ్రిటన్ లో..ఈ రెస్టారెంట్ పేరు హార్లీస్ కేఫ్ ..కాఫీ బార్ ..ఈ కేఫ్ ఇంటీరియర్ డిజైన్ కోసం లక్షల రూపాయలు వెచ్చించారు. సంగీతం, చలనచిత్రాలు, క్రీడలకు సంబంధించిన వస్తువులతో కేఫ్ బాగా అలంకరించి ఉంటుంది. ఇది కాకుండా కేఫ్ గోడలపై అద్భుతమైన కళాఖండాలను అమర్చారు. వీటిని పిల్లలు పాడు చేస్తారని ఈ కండిషన్ ని పెట్టామని దీని యజమానులు టోనీ, బెవర్లీ ఫ్లెకెట్ వెల్లడించారు.
అంతేకాదు ఈ కేఫ్ అల్పాహారం ఇక్కడ చాలా ఫేమస్. అద్భుతమైన వంటకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. కానీ షరతు ప్రకారం ఐదేళ్లలోపు పిల్లలు ఇక్కడ రుచికరమైన వంటకాలను ఆస్వాదించలేరు. ఈ కేఫ్ బయట ఒక బోర్డు ఉంటుంది. ఇందులో ఓనర్ సారీ అని చాలా డీసెంట్ గా రాసారు.. ఈ కేఫ్ ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను అనుమతించదని రాసి ఉంటుంది. 23 ఏళ్లుగా ఈ నిబంధన అమల్లో ఉందని కేఫ్ యజమానులు తెలిపారు. వారి ప్రకారం.. పిల్లలు ప్రతిచోటా పరిగెత్తుతారు. ఇది కేఫ్‌లో చాలా గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే ఈ షరతు విధించారట. ఇది కరెక్టే కానీ మరి పిల్లలు ఉన్న తల్లిదండ్రులకి అక్కడి ఆహారాన్ని తినాలనిపిస్తే ఎలా మరి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..