గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు జోగి రమేశ్.. విశాఖలో లక్ష మంది మహిళలకు ఇళ్లు కట్టించే ఫైల్‌పై తొలి సంతకం పెట్టారు. గృహాలకు సిమెంట్ కేటాయింపులు పెంచుతూ రెండో సంతకం పెట్టారు. అమరావతిలోని సచివాలయంలో తన కార్యాలయంలో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.. తొలి రెండు సంతకాలను రెండు కీలక అంశాలకు చెందిన ఫైళ్లపై చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు రమేశ్..అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తున్న సీఎం జగన్ అభినందించాల్సిందేనన్నారు. అంబేద్కర్ అసలైన వారసుడు అని కీర్తించారు. మంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రమేశ్‌కు తాజా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి మేరుగ నాగార్జున, వైసీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం తదితరులు అభినందించారు.
గృహనిర్మాణశాఖ మంత్రిగా బాధ్యతలు – లక్షమంది మహిళలకు ఇళ్లు- జోగి రమేశ్
Advertisement
తాజా వార్తలు
Advertisement