Saturday, November 23, 2024

పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ ఘ‌ట‌న‌పై స్పందించిన – ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏపీలో భారీ అగ్రిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న త‌నని క‌ల‌చి వేసింద‌న్నారు జ‌న‌సేన అధినేత‌, న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.
ఏలూరులోని పోర‌స్ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది..కాగా ఈ ఘ‌ట‌న‌లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున సీఎం జ‌గ‌న్ నష్టపరిహారాన్ని అందించారు. అయితే ఈ నష్టపరిహారం సరిపోదని జనసేనాని జగన్ అన్నారు. ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పవన్ అన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహాలో పరిహారాన్ని ఇవ్వడం సరికాదని అన్నారు. ఈ ఘటనలో మరో 13 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలయ్యారని… వీరందరికీ మెరుగైన వైద్యం అందించి, న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement