నీట్-పీజీ కౌన్సెలింగ్‌ను వేగవంతం చేయాలనే డిమాండ్‌పై రెసిడెంట్ వైద్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు నిన్న చేపట్టిన నిరసనలో జరిగిన పోలీసు దాడిని ఖండించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. త్వరలో ఈ సమస్యకి పరిష్కారాన్ని చూపాలని కేజ్రీవాల్ , ప్రధాని మంత్రి మోడీకి లేఖ రాశారు .. నీట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ (నీట్)పెట్టి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడం దారుణమని రెసిడెండ్ డాక్టర్లు సేవలను నిలిపివేసి నిరసనలు చేపట్టారు. దాంతో ఢిల్లీలో వైద్యుల ఆందోళన రెండో రోజుకి చేరింది. పోలీసులు, డాక్టర్ల మధ్య తోపులాట జరిగింది. సుప్రీంకోర్టుకి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్న రెసిడెంట్ డాక్టర్లను పోలీసులు సప్దర్ జంగ్ హాస్పటల్ వద్ద నిలిపివేశారు. ఆసుపత్రి ప్రధాన ద్వారాలన్నింటినీ పోలీసులు మూసేశారు. గత రాత్రి పోలీసులు తమపై దాడికి దిగారని కొందరు రెసిడెంట్ డాక్టర్లు ఆరోపించారు. అలాంటిదేమీ లేదని పోలీసులు చెబుతున్నా.. రెండు వర్గాల మధ్య జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ , మోడీకి లేఖ రాశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..