రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని మంగళవారం సమాధానమిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ, సిక్కు మారణహోమం వంటివి ఉండేవి కాదని ఆ పార్టీ తీరుతో ఇవన్నీ జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ పేరును ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కాకుండా ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్‌గా మార్చుకుంటే బాగుంటుందని సూచించారు మోడీ.
అస్సులు కాంగ్రెస్ లేకుంటే భారతదేశం ఎమర్జెన్సీ, అవినీతి, సిక్కుల మారణహోమం, కాశ్మీరీ పండిట్ల వలసల నుండి విముక్తి పొంది ఉండేదన్నా ప్రధాని మోడీ. ప్రజలకు కనీస సౌకర్యాలు లభించేవని ప్రతిపక్షాల నిరసనల మధ్య మోడీ ధ్వజమెత్తారు. కాగా, ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.