Friday, November 22, 2024

Old Case | పెన్నా సిమెంట్స్ చార్జ్‌షీట్‌ నుంచి నా పేరు తొలగించండి.. సీబీఐ కోర్టును కోరిన మంత్రి సబిత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహాన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించిన పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితురాలిగా ఉన్న తన పేరును తొలగించాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటి-షన్‌పై సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. సబితా ఇంద్రారెడ్డిని కేసు నుంచి తొలగించవద్దని సీబీఐ వాదించింది. నిబంధనలకు విరుద్ధంగా పెన్నా సిమెంట్స్‌కు గనుల కేటాయింపులో సబిత ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది.

ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. సబితా ప్రమేయంపై ఆధారాలున్నాయని సీబీఐ స్పష్టం చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం డిశ్చార్జి పిటిషన్‌పై విచారణ ఈనెల 28వ తేదికి వాయిదా వేసింది జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌పై కూడా సీబీఐ కోర్టు విచారణ జరిపింది. పెన్నా సిమెంట్స్‌ ఛార్జ్‌షీట్‌ నుంచి తొలగించాలని శ్రీలక్ష్మి కోరింది. ఈ పిటిషన్‌పై కూడా విచారణ కోర్టు ఈనెల 28కి వాయిదా వేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement