దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గాయి… గత నెల రోజుల క్రితం వరకూ రోజుకు దేశ వ్యాప్తంగా లక్షల్లో నమోదైన కేసులు… ప్రస్తుతం వేల సంఖ్యలో మాత్రమే నమోదవుతున్నాయి. అలాగే దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా కరోనా కేసులు భారీగా తగ్గాయి. దీంతో కోవిడ్ ఆంక్షలను సడలించింది కేజ్రీవాల్ సర్కార్. కరోనా కట్టడికి విధించిన నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ. గతంలో మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానా విధించేవారు. ఇప్పుడు దాన్ని 500 వరకు తగ్గించింది. నైట్ కర్ఫ్యూ ఎత్తివేయడంతో దుకాణాలు, రెస్టారెంట్లు, అర్థరాత్రి వరకు తెరిచి ఉంటాయి. అలాగే ఏప్రిల్ 1 నుంచి పాఠశాలలు పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. స్కూల్స్ లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించుకోవచ్చని చెప్పారు. అంతేకాదు బస్సులు, మెట్రో రైళ్లలో విధించిన నిబంధనలను సడలించిందని అధికారులు వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital