కొవిడ్ చికిత్స ప్రోటోకాల్ నుంచి రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు. కొవిడ్-19 చికిత్సలో బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే ఇందుకు కారణమని మంగళవారం తెలిపారు. ఇప్పటికే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ప్లాస్మా చికిత్సను ప్రోటోకాల్స్ నుంచి తొలగించింది. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఏర్పడ్డ యాంటీబాడీలు రోగులపై ప్రభావం చూపిస్తాయని భావించామని, ఈ క్రమంలోనే ప్లాస్మా థెరపీ చేపట్టామన్నారు. అయితే, ఈ చికిత్సతో బాధితులు కోలుకుంటున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దాన్ని ప్రోటోకాల్ నుంచి తొలగించామన్నారు. ప్రస్తుతం కరోనా చికిత్సలో వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌కు సంబంధించి అలాంటి ఆధారాలు లేవని, అలాంటి మందులను వాడడాన్ని నిలిపివేయాలని డాక్టర్ రాణా అభిప్రాయపడ్డారు. త్వరలోనే అవన్నీ తొలగించబడుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు మందులు మాత్రమే పని చేస్తున్నాయని రాణా తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement