యావత్ దేశ ప్రజలకు గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. రేపటి నుంచి (16వ తేదీ సోమవారం) దేశంలో వేడిగాలుల తీవ్రత తగ్గుతుందని, ఉక్కపోతకు ఉపశమనం లభిస్తుందన్న వార్త తెలిపింది ఐఎండీ. ఆదివారం రాత్రి వాయవ్య భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో కల్లోలం ఉంటుందన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర. అంతేకాకుండా ఇవ్వాల, రేపు హీట్‌వేవ్ కొనసాగుతుంది, 16వ తేదీ నుంచి క్రమంగా తగ్గుతుందని తెలిపారు.
ఇక.. జమ్ము, కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర భారతదేశంలోని ఆనుకుని ఉన్న మైదానాలతో పాటు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. తర్వాత, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. హీట్ వేవ్ కూడా రోజు రోజుకూ తగ్గిపోతుంది. అని మహపాత్ర తెలిపారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఎంపీ, రాజస్థాన్, విదర్భలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని మహపాత్ర తెలిపారు.
అంతేకాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అండ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఎంపీ, రాజస్థాన్ & విదర్భలో తీవ్రమైన వేడిగాలులు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 40-46°C వరకు ఉంటాయి. రాజస్థాన్, ఎంపీ మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్ & ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశాం అని మహపాత్ర చెప్పారు.