Saturday, November 16, 2024

Weather: ఉక్కపోతకు ఉపశమనం.. ఇక వాతావరణం కూల్​ కూల్!​

యావత్​ దేశ ప్రజలకు గుడ్​న్యూస్​ తీసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. రేపటి నుంచి (16వ తేదీ సోమవారం) దేశంలో వేడిగాలుల తీవ్రత తగ్గుతుందని, ఉక్కపోతకు ఉపశమనం లభిస్తుందన్న వార్త తెలిపింది ఐఎండీ. ఆదివారం రాత్రి వాయవ్య భారతదేశంలోని పశ్చిమ  ప్రాంతంలో కల్లోలం ఉంటుందన్నారు వాతావరణ శాఖ డైరెక్టర్​ జనరల్​ మృత్యుంజయ్​ మహాపాత్ర. అంతేకాకుండా ఇవ్వాల, రేపు హీట్​వేవ్​ కొనసాగుతుంది, 16వ తేదీ నుంచి క్రమంగా తగ్గుతుందని తెలిపారు.

ఇక.. జమ్ము, కశ్మీర్​, హిమాచల్​ ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, ఉత్తర భారతదేశంలోని ఆనుకుని ఉన్న మైదానాలతో పాటు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుంది. తర్వాత, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. హీట్​ వేవ్​ కూడా రోజు రోజుకూ తగ్గిపోతుంది. అని మహపాత్ర తెలిపారు. పంజాబ్​, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఎంపీ, రాజస్థాన్​, విదర్భలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని మహపాత్ర తెలిపారు.

అంతేకాకుండా రాజస్థాన్, మధ్యప్రదేశ్​, హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్​ అండ్​ ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఎంపీ, రాజస్థాన్ & విదర్భలో తీవ్రమైన వేడిగాలులు ఉన్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణ ఉష్ణోగ్రత కంటే 40-46°C వరకు ఉంటాయి. రాజస్థాన్, ఎంపీ మరియు హర్యానాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్​ & ఆరెంజ్​ హెచ్చరికలు జారీ చేశాం అని మహపాత్ర చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement