Friday, November 22, 2024

భ‌గ భ‌గ మండే ఎండ‌ల‌నుంచి ఉప‌శ‌మ‌నం.. కొబ్బ‌రినీళ్లు ఎంతో బెట‌ర్..

ప్రభ న్యూస్‌, : ఇంతకుముందు ఎన్నడూ లేనివిధంగా ఎండలు తీవ్రమవుతున్నాయి. భానుడి భగభగతో అమాంతం పెరుగుతున్న ఉష్ణోగ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బోండాలు, చల్లటి మజ్జిగ, నిమ్మరసం, శీతల పానీయాలు తీసుకుంటుంటారు. దీనికోసం పట్టణ కూడళ్లు, జన సందోహాల ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో వీటిని విక్రయిస్తున్నారు. డాక్టర్లు సైతం వేసవి తాపానికి కొబ్బరి బోండాలు శ్రేయస్కరమని సూచిస్తుండటంతో కొబ్బరి బోండాలకు గిరాకీ జోరందుకున్నది. సాధారణ బోండాలతో పాటు బెంగళూరు, మైసూరు బోండాల్లో నీరు ఎక్కువగా ఉండటంతో మార్కెట్లో వాటికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కొబ్బరి నీళ్లలో విటమిన్స్‌, న్యూట్రిన్స్‌, సమృద్ధిగా లభిస్తాయి. మహిళలు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు, కొబ్బరి నీళ్లు తాగేందుకు ఆసక్తి కనబర్చుస్తున్నారు.

వేసవి కాలంలో సంపూర్ణ ఆరోగ్యానికి కొబ్బరి బోండాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వేసవి తాపం నుంచి తక్షణం ఉపశమనం పొందటమే కాకుండా శరీరంలో లవణాల శాతాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కొబ్బరి నీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆవు పాలకంటే అధిక ప్రోటీన్లతో పాటు విటమిన్లు ఉండటమే ఈ పానీయం గొప్పదనం. కొబ్బరి బోండాలు రూ.30 నుంచి 40 వరకు, బెంగళూరు బోండాలు రూ.40 వరకు ధర పలుకుతున్నాయి. లీటరు కొబ్బరి నీళ్లు ఇంతకు ముందు రూ.80 విక్రయించగా, ప్రస్తుతం లీటరు కొబ్బరి నీళ్లు రూ.100 వరకు విక్రయిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement