Monday, November 18, 2024

పోర్న్ ఫిల్మ్ రాకెట్ కేసులో నటి షెర్లిన్ చోప్రాకు ఊరట.. అప్పుడే అరెస్టు చేయొద్దన్న సుప్రీం కోర్టు..

పోర్న్ సినిమాల రాకెట్ కేసులో నటి షెర్లిన్ చోప్రాకు శుక్రవారం సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. తన ముందస్తు బెయిల్‌ను తిరస్కరిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇవ్వగా .. దానిపై  చోప్రా సుప్రీం కోర్టుకు వెళ్లింది.  ఈ అప్పీల్‌పై న్యాయమూర్తులు వినీత్ శరణ్, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. “నోటీస్ ఇవ్వండి.. ఈలోగా పిటిషనర్‌పై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోరాదు” అని ధర్మాసనం పేర్కొంది.

చోప్రా తరఫు న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ఇతర నిందితులకు ఊరట కల్పించామని తెలిపారు. నటి పూనమ్ పాండేతో పాటు చోప్రాను ఎఫ్‌ఐఆర్‌లో నిందితురాలిగా చేర్చారు. గత ఏడాది నవంబర్ 25న ముందస్తు బెయిల్ దరఖాస్తును చేసుకోగా అప్పట్లో  హైకోర్టు తిరస్కరించింది. కాగా, పాండేను అరెస్టు చేయొద్దని జనవరి 18న అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. అశ్లీల వీడియోలను పంపిణీ చేశారనే ఆరోపణపై డిసెంబరులో  రాజ్ కుంద్రాపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం ఈ అరెస్టు నుండి ఊరట కల్పించింది.

రాజ్ కుంద్రా లైంగిక, అసభ్యకరమైన వీడియోలను పంపిణీ చేయడం/ప్రసారం చేయడం వంటి ఆరోపణలపై భారతీయ శిక్షాస్మృతి, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నివారణ) చట్టం,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement