హైదరాబాద్, ఆంధ్రప్రభ: 2022-23 విద్యా సంవత్సరానికి మూడు, ఐదేళ్ల లాకోర్సు, పీజీ ఎల్‌ఎల్‌ఎం లా కోర్సుకు సంబంధించి నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూన్ 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రూ.500 నుంచి రూ.2000 వరకు లేట్ ఫీజుతో జులై 12 వరకు గడువిచ్చారు. జులై 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 60 పరీపక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
జులై 26న ప్రాథమిక కీ విడుదల చేసి రెండు రోజుల వరకు అభ్యంతరాలను స్వీకరించి ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ.ఆర్.లింబాద్రి తెలిపారు. ఈమేరకు మండలి వైస్ ఛైర్మన్ ప్రొ.వి.వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొ.డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ ప్రొ.జీబీ.రెడ్డి కాకతీయ వీసీ ప్రొ.టీ.రమేష్, మహాత్మాగాంధీ వీసీ ప్రొ.సిహెచ్.గోపాల్‌రెడ్డి, కార్యదర్శి ఎన్.శ్రీనివాస్‌రావు లాసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..