Friday, November 22, 2024

జులై వరకు నో రెగ్యులర్ ట్రైన్స్

గతేడాది కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన రైళ్వే సర్విసులు…ఇప్పట్లో మొదలైయ్యేలా కనిపించడం లేదు. జూలై తర్వాతే రెగ్యులర్ సర్విసులను నడిపించే యోచనలో ఉన్నారు. దేశంలో కరనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాక్ డౌన్ తర్వాత రైళ్ల రాకపోకలను ప్రభుత్వం నిలిపివేసింది. అయితే, ఆ తర్వాత వైరస్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ప్రయాణికుల అవసరార్థం గతేడాది చివరి నుంచి పలు జాగ్రత్తలతో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయినప్పటికీ ప్రత్యేకం అనే ట్యాగ్ తీయకుండా అదనపు చార్జీలతో వీటిని నడిపిస్తున్నారు. రైల్వే తీరుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లలో కొన్నింటిని జూన్ నెలాఖరు వరకు, మరికొన్నింటిని జులై తొలి వారం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ప్రయాణికుల నెత్తిన అదనపు చార్జీల మోత తప్పడం లేదు. ప్రస్తుతం ఎక్స్ ప్రెస్ రైళ్లు మినహా.. ప్యాసింజర్ రైళ్లు నడవడం లేదు. దీంతో మధ్యతగరతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement