Tuesday, November 26, 2024

ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో అంతర్జాతీయ విమాన సర్వీసులు

కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల క్రితం నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మార్చి లేదా ఏప్రిల్ నుంచి సేవలు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 23 నెలల నిషేధం తర్వాత, సాధారణ అంతర్జాతీయ విమానాలు మార్చి/ఏప్రిల్‌లో సేవలను పునఃప్రారంభించవచ్చని సమాచారం.

కరోనా మహమ్మారి ప్రపంచంపై విరుచుకుపడిన అనంతరం అంతర్జాతీయ విమానా సర్వీసులపై చాలా దేశాలు నిషేదం విధించాయి. ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పటికే చాలా దేశాలు నిబంధనలు సడలించాయి. కొన్ని దేశాలు పరిమిత సంఖ్యలో అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

దేశీయ విమాన రంగం పుంజుకుంటూ కరోనా ప్రభావం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. దేశీయ ప్రయాణికుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. మరో రెండు నెలల్లో ప్రయాణికుల సంఖ్య కరోనా మునుపటి పరిస్థితికి చేరుకునే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement