తెలంగాణలో లాక్‌డౌన్ మినహాయింపు సమయం పెంచిన నేపథ్యంలో ఇవళ్టి నుంచి అందించే ప్రభుత్వ సేవలు పెరగనున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇక మంగళవారం నుంచి పాస్‌పోర్ట్ సేవలు మొదలు కానున్నాయి. బ్యాంకుల పనివేళలూ పెరుగనున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 2 వేలు జరిగాయి. లాక్‌డౌన్ దృష్ట్యా వ్యవసాయేతర రిజిస్ట్రేషపూర్తిగా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ ద్వారా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిప్రకారం ప్రతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రోజుకు 24 చొప్పున చేస్తున్నారు. ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్లు ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజుకు 48 వరకు అనుమతినిస్తున్నారు. స్లాట్ బుక్‌కు www.telangana. regisration.inలో లాగిన్ కావాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్ శేషాద్రి సూచించారు.
రీజినల్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్ లఘుకేంద్రాలు మంగళవారం నుంచి తమ సేవలను పునరుద్ధరించనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పనిచేస్తాయనున్నాయి. ఇక రాష్ట్రంలోని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేశారు. మంగళవారం నుంచి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకు లు తెరిచి ఉంటాయి