Tuesday, November 19, 2024

Order Order | ద్వేషపూరిత ప్రసంగాలపై వెంటనే కేసులు.. లేకుంటే కోర్టు ధిక్కరణగా భావిస్తాం: సుప్రీంకోర్టు

ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ జర్నలిస్ట్ షాహీన్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందించింది. ఎటువంటి ఫిర్యాదు అందకున్నా సరే.. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వారిపై కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవ్వాల (శుక్రవారం) ఆదేశించింది. లేకుంటే కోర్టు ధిక్కరణగా భావించాల్సి వస్తుందని సీరియస్​గా హెచ్చరించింది. అంతేకాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని సుప్రీం కోర్టు సూచించింది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ద్వేషపూరిత ప్రసంగాలపై వెంటనే కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇవ్వాల (శుక్రవారం) సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్​, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. ద్వేషపూరిత ప్రసంగాలు దేశ లౌకిక స్వరూపాన్ని ప్రభావితం చేస్తాయని, తీవ్రమైన నేరంగా పరిగణించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు 2022లోని ఉత్తర్వు యొక్క పరిధిని మూడు రాష్ట్రాలకే కాకుండా.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకూ విస్తరిస్తూ అమలు చేయాలని సూచించింది.

పౌరులు ఎవరు ఎటువంటి ఫిర్యాదు చేయనప్పటికీ.. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.  ధర్మాసనం అక్టోబర్ 21, 2022 ఆర్డర్ మతంతో సంబంధం లేకుండా వర్తిస్తుందని.. కేసులను నమోదు చేయడంలో ఏదైనా ఆలస్యం చేస్తే కోర్టు ధిక్కారంగా పరిగణించాలని రాష్ట్రాలను హెచ్చరించింది.

- Advertisement -

మతం పేరుతో మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం మతాన్ని ఏ స్థాయికి తీసుకెళ్తున్నాం” అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ద్వేషపూరిత ప్రసంగాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లను సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. – తటస్థంగా ఉన్న దేశానికి మతం అనేది దిగ్భ్రాంతికరమని పేర్కొంది. భారత రాజ్యాంగం లౌకిక దేశాన్ని తలపిస్తోందని.. ఫిర్యాదు దాఖలయ్యే వరకు వేచి చూడకుండా నేరస్థులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీలను కోర్టు ఆదేశించింది.

అంతేకాకుండా.. “న్యాయమూర్తులు రాజకీయ రహితులు, పార్టీ A లేదా పార్టీ Bతో సంబంధం కలిగి ఉండరు. వారి మనస్సులో ఉన్న ఏకైక విషయం భారత రాజ్యాంగం” అని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ప్రయోజనం కోసం.. చట్టం యొక్క పాలన స్థాపనను నిర్ధారించడం కోసం కోర్టు పిటిషన్లను స్వీకరించిందని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement