Friday, November 22, 2024

నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్ర్కిప్ష‌న్ చార్జిలు త‌గ్గింపు.. మంత్లీ 149 ప్లాన్ అందుబాటులోకి..

స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వీక్షకులను ఆకట్టుకునేలా ధరలను తగ్గించేసింది. కొత్తగా స‌బ్‌స్క్రైబ్ చేసుకునే వారికి గరిష్టంగా 60శాతం వరకూ తగ్గింపు లభించనుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ నెలవారీ సభ్యత్వానికి రూ.199 చెల్లించాల్సి ఉండగా.. తగ్గిన ధరలతో.. రూ.149కే అందుబాటులోకి రానుంది. తగ్గిన ధరలు కూడా మంగళవారం (డిసెంబర్‌ 14) నుండే అమల్లోకి రానున్నాయని నెట్‌ఫ్లిక్స్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఇక బేసిక్‌ ప్లాన్‌ ధరను రూ.499 నుంచి రూ.199కి తగ్గించారు. అలాగే స్టాండర్డ్‌ ప్లాన్‌కు రూ.499, ప్రీమియం ప్లాన్‌కు రూ.649 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఇవి వరుసగా రూ.649, రూ.799 వద్ద అందుబాటులో ఉండేవి. లాక్‌డౌన్‌ సమయంలో వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లకు విశేష ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.

నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ హాట్‌స్టార్‌, జీ5, ఆహా, హంగామా, ఏఎల్‌టీ బాలాజీ వంటి వాటి మధ్య విపరీతమైన పోటీ నెలకొనడంతో.. ఆయా సంస్థలు వ్యూయ‌ర్స్‌ని ఆకట్టుకునేలా వినూత్న కంటెంట్‌ను తీసుకొస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌ సభ్యత్వ రుసుము తగ్గిస్తే.. మరోవైపు అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వ రుసుము పెంచి వీక్షకులకు మరింత ద‌గ్గ‌ర అవుతోంది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సభ్యత్వం రూ.999 ఉండగా.. రూ.1499 చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఇక నెలవారీ సభ్యత్వ రుసుము రూ.129గా ఉండగా.. పెంచిన ధరలతో.. రూ.179గానూ (38శాతం అదనం), మూడు నెలలకు రూ.329 కాస్తా, రూ.459 (39శాతం అదనం) అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement