తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : రాష్ట్రంలో మళ్ళీ ఎర్ర చందనం వేలం సందడి మొదలైంది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఉన్న ఎర్రచందనం నిల్వల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలవడానికి సిద్ధమైంది. అధికారిక గణాంకాల ప్రకారం గత రెండు దశబ్దాల మధ్యకాలంలో గ్లోబల్ టెండర్ల ద్వారా 12 విడతలలో 1,400 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించగా.. రాష్ట్రానికి రూ.1,850 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం తిరుపతిలోని కరకంబాడి వద్ద ఎర్రచందనం సెంట్రల్ గోడౌన్‌లో 5,600 టన్నుల దుంగలు అమ్మకానికి సిద్ధంగా ఉంది. అంతేకాక తిరుపతిలోనే కపిలతీర్థం వద్ద ఉన్న అటవీ శాఖ కార్యాలయం వద్ద మరో గోడౌన్‌లో దాదాపు 100 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉన్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement