తెలంగాణలో మిర్చి ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ రైతులకు కాసులు కురిపిస్తున్నాయి. మిర్చి ధర రోజు రోజుకీ పెరిగిపోతూ పసిడిను మించిపోయింది. తాజాగా వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో దేశి రకం మిర్చి క్వింటాల్ కు రూ.55,571 పలికింది. ఇప్పటివరకు మార్కెట్ చరిత్రలో ఇదే అత్యధిక ధర అని అధికారులు వెల్లడించారు. కొన్ని రోజులక్రితం దేశిరకం మిర్చి ధర క్వింటాల్‌కు రూ.52 వేలు పలికిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన పేరాల కిషన్ రావు అనే రైతు 30 బస్తాల మిర్చిని ఎనుమాముల మార్కెట్‌కు తీసుకువచ్చారు. దానిని శాంభవి ట్రేడర్స్ ఖరీదుదారులు క్వింటాల్‌కు రూ.55,571 చొప్పున కొనుగోలు చేశారు.
FLASH: పసిడిని దాటేసిన ఎర్ర బంగారం ధర.. రూ.55 వేలు పలికిన దేశిరకం మిర్చి
Advertisement
తాజా వార్తలు
Advertisement