Tuesday, November 19, 2024

Boat Accident : పడవ ప్రమాదంలో 14 మృత‌దేహాల వెలికితీత‌

ఝార్ఖండ్‌ జామ్​తాడా జిల్లాలో ఫిబ్రవరి 24 సాయంత్రం 6 గంటలకు బరాకర్​ నదిలో జామ్​తాడా నుంచి నిర్సాకు వెళ్తుండగా పడవ బోల్తా పడింది. బరాకర్​ నది పడవ ప్రమాదంలో గల్లంతైన 14 మంది మృతదేహాలను జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) వెలికితీసింది. ఐదు రోజుల పాటు ఈ రెస్య్కూ ఆపరేషన్​ జరిపింది. మృతదేహాలను గుర్తించి, పోర్టుమార్టం చేసిన అనంతరం వారి బంధువులకు అప్పగించారు. బలమైన ఈదురు గాలులు, వర్షం, తుపాను ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. పడవలో ఉన్నవారంతా కూరగాయలు విక్రయించే చిరు వ్యాపారలేనని తెలుస్తోంది. పడవలో ఉన్న నలుగురు ఎలాగోలా తమ ప్రాణాలు కాపాడుకోగా, 14 మంది నీటిలో మునిగిపోయారు. అప్పటి నుంచి పట్నా, రాంచీ ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను కొనసాగించాయి. ఎట్ట‌కేల‌కు 14మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement