Tuesday, November 26, 2024

ఆండ్రాయిడ్ ఫోన్ లో డిలీట్ అయిన డేటా తిరిగి పొందొచ్చు.. ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీ..

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? పొరపాటున ముఖ్యమైన ఫొటో లేదా వీడియో డిలీట్ అయ్యిందా? అయితే దాన్ని ఈజీగా రికవరీ చేయడానికి అందుబాటులో ఉన్న కొన్ని టెక్నిక్స్ చదవి తెలుసుకుందాం..

ఇటీవలికాలంలో శాంసంగ్, ఇతర సంస్థలకు చెందిన కొన్ని స్మార్ట్ ఫోన్ లలో ఇంటర్నల్ గా ఉండే గ్యాలరీ అప్లికేషన్ లో Recycle Bin అనే ఆప్షన్ ఉంటోంది. ఫొటోలు, వీడియోలను డిలీట్ చేసినప్పుడు అవి పర్మినెంట్ గా డిలీట్ అవ్వకుండా.. ఈ రీసైకిల్ బిన్‌లోకి వెళతాయి. కాబట్టి ఇతర డేటా రికవరీ పద్ధతులు ప్రయత్నించడానికి ముందు Recycle Binలో డిలీట్ చేసిన ఫైల్స్ కనిపిస్తున్నాయేమో పరిశీలించండి. అక్కడ కనుక ఆ ఫైల్స్ ఉంటే వాటిని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఒకవేళ రీసైకిల్ బిన్ డిజేబుల్ చేసినట్లయితే చేయగలిగేది ఏమీ ఉండదు.

గూగుల్ ఫొటోస్ వంటి అప్లికేషన్ ఏదైనా ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుని ఉంటే.. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు ఆటోమేటిక్ గా దాంట్లోకి బ్యాకప్ అవుతాయి.. కాబట్టి అదృష్టవశాత్తూ అవి అక్కడ ఉంటే వాటిని కూడా రికవర్ చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే మీరు అక్కడ కూడా వాటిని డిలీట్ చేసినట్టయితే చేయగలిగిందేమీ ఉండదు.

మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొద్దిరోజుల క్రితం పంపించిన ముఖ్యమైన వాట్సాప్ ఫొటోలు, వీడియోలు పొరబాటున డిలీట్ చేసినట్లైతే.. ఒక చిన్న టెక్నిక్ ద్వారా వాటిని రికవరీ చేసుకునే చాన్స్ ఉంది. ఫోన్లో లోకల్ గా గానీ, గూగుల్ డ్రైవ్ లో గానీ వాట్సాప్ బ్యాకప్ ప్రతీరోజూ అవుతున్నట్లు అయితే, ఫోన్లో వాట్స్అప్ అప్లికేషన్ తొలగించి.. మళ్లీ ఇన్ స్టాల్ చేసే సమయంలో chat backup restore చేయడం ద్వారా ఇంతకుముందు పోయిన ముఖ్యమైన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో బ్యాక్అప్ ఇంటిగ్రిటీ దెబ్బతిని ఉండటం వల్ల ఈ ప్రయత్నం కూడా వైఫల్యం చెందవచ్చు.

డేటా రికవరీ ఆప్స్..

అన్నిటికంటే సమర్ధవంతంగా పని చేసే టెక్నిక్ Windows కంప్యూటర్ల కోసం అందుబాటులో ఉన్న వివిధ డేటా రికవరీ అప్లికేషన్ లను సంబంధిత కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసి, డేటా కేబుల్ ద్వారా మీ ఫోన్‌ని ఆ సిస్టమ్ కు కనెక్ట్ చేసి డేటా రికవరీ ప్రయత్నించవచ్చు. అయితే ఇలాంటి డేటా రికవరీ అప్లికేషన్లు ప్రధానంగా మెమరీ కార్డు లో డేటాని సమర్థవంతంగా రికవర్ చేయగలుగుతాయి. ఇంటర్నల్ స్టోరేజ్ లో ఉండే డేటాని ఫోన్ రూట్ చేస్తే తప్పించి రికవర్ చెయ్యలేవు. అయినా కొన్ని సార్లు డేటా వెనక్కి రాదు. ముఖ్యమైన డేటా ఉంటే అన్ని రకాలుగా ప్రయత్నించడమే. దీనికి Recuva, Android Data Recocvery వంటి టూల్స్ ని ఉపయోగించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement