బారత దేశ చరిత్రలోనే అతిపెద్ద సంస్థ అయిన ఎల్ఐసీ.. ఐపీవో ప్రారంభంలోనే అనేక రికార్డులను తిరగరాసి కొత్త చరిత్ర సృష్టించింది. ఎల్ఐసీ ఐపీవోలో పాల్గొనేందుకు రిటైల్ ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐపీవో ఆరంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ నుంచి 5,620 కోట్లను ఎల్ ఐసీ సమీకరించింది. ఇష్యూలో భాగంగా LICలో 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్లు, 13 లక్షల షేర్లను విక్రయించి 20, 557 కోట్లను సమీకరించాలని కేంద్రం ప్లాన్ చేసింది.
ఈ ఇష్యూ ఈ నెల 9న ముగియనుంది. ఈనెల 17న స్టాక్ ఎక్సేంజ్ లలో ఎల్ఐసీ లిస్ట్ కానుంది. మరోవైపు ఎల్ ఐ సీ ఐపీవోకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు.