కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రధాని మోడీ కూడా మెచ్చుకున్నారు. కాగా వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ది కశ్మీర్ ఫైల్స్’కు ఉత్తరాఖండ్ సర్కారు మద్దతు పలికింది. ఈ సినిమాను చూసేలా ప్రజలను ప్రోత్సహించేందుకు పన్ను నుంచి మినహాయింపునివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ప్రకటించారు. 1990లలో జరిగిన కశ్మీరీ పండిట్ల ఊచకోత అంశంతో తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మరోవైపు సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐదో రోజు మరింత పెద్ద మొత్తంలో వసూళ్లను సాధించింది. గత శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు రూ.3.55 కోట్లు, శనివారం రూ.8.50 కోట్లు, ఆదివారం రూ.15.10 కోట్లు, సోమవారం రూ.15.05 కోట్ల చొప్పున రాబట్టుకుంది. ఇక తొలి నాలుగు రోజుల స్థాయిని దాటేసి మంగళవారం ఐదో రోజు రూ.18 కోట్లు రాబట్టింది. దీంతో మొత్తం వసూళ్లు రూ.60 కోట్లు దాటిపోయాయి.
రికార్డు సృష్టిస్తోన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ – వారం కాకముందే రూ.60కోట్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement