చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌పై తిరుగుబాటు జరిగిందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రపంచ పెద్దన్నగా చైనాను చేయాలనుకున్న కల నెరవేరకుండానే జిన్‌పింగ్ వైదొలిగే చాన్స్ వచ్చిందన్న విషయాలు సర్య్కులేట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సైన్యం తిరుగుబాటు చేసిందని, జిన్‌పింగ్‌ని గృహ నిర్బంధంలో ఉంచిందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం దీనికి సంబంధించి ఎట్లాంటి వివరాలు తెలియజేయడం లేదు. చైనా మీడియా సంస్థలు కూడా పెద్దగా రియాక్ట్ కాలేదు. కాకపోతే కొన్ని వీడియోలు మాత్రం సైనిక చర్యను నిర్ధారించేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు..
బీజింగ్ చుట్టూ సైన్యం
చైనా రాజధాని బీజింగ్ చుట్టూ సైన్యం మోహరించినట్టు కొన్ని వీడియోలలో ఉండడం ఈ వార్తలకు ఊతమిస్తోంది. అలాగే, 80 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్ బీజింగ్ దిశగా వెళ్తున్నట్టు కూడా కొన్ని వీడియోలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుందని, సైనికాధికారి లీ కియావోమింగ్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు కూడా చేపట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి
బీజింగ్‌తో తెగిపోయిన సంబంధాలు
ప్రస్తుతం బీజింగ్‌కు ఇతర దేశాలతో సంబంధాలు తెగిపోయాయని, అంతర్జాతీయ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో, మాజీ ప్రధాని వెన్ జియాబావో కలిసి ‘సెంట్రల్ గార్డ్ బ్యూరో’ (సీజీబీ) పగ్గాలు చేపట్టాల్సిందిగా స్థాయి సంఘం మాజీ సభ్యుడు సాంగ్ పింగ్‌ను ఆదేశించారన్న మరో వార్త కూడా ప్రచారంలో ఉంది.
సమర్‌కండ్ నుంచి రాగానే నిర్బంధంలోకి
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌కండ్‌లో ఇటీవల జరిగిన షాంఘై సహకరా సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొన్న జిన్‌పింగ్ తిరిగి స్వదేశానికి రాగానే సైన్యం నిర్బంధంలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి భద్రత ఏర్పాట్లను చూసే సీజీబీయే గత పది రోజుల్లో రహస్యంగా సమావేశమయ్యారని, అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందని కూడా చెబుతున్నారు. వరుసగా మూడోసారి కూడా జిన్‌పింగ్ అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తుండడమే ఈ సైనిక చర్యకు కారణమని తెలుస్తోంది. అంతేకాదు, జిన్‌పింగ్ సమర్‌కండ్‌లో ఉన్నప్పడే కుట్ర జరిగినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అవినీతిని సహించకపోవడే కారణం?
2012లో జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి వ్యతిరేకంగా బలంగా గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అవినీతి ఆరోపణలపై పలువురు అధికారులు, రాజకీయ నేతలకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలపై ఇటీవల ఇద్దరు మాజీ మంత్రులకు, మరో మాజీ ఉన్నతాధికారికి మరణశిక్షలు విధించారు. మరో నలుగురు అధికారులకు యావజ్జీవ శిక్షలు విధించారు. జిన్‌పింగ్‌పై సైనిక చర్యకు ఇది కూడా ఓ కారణమని చెబుతున్నారు. ఈ వార్తలపై నేడు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.