: రూ.కోట్లు తెచ్చి వెంచర్లు వేసిన వ్యాపారులు
: కొనుగోళ్లు లేక.. తడిచి మోపెడవుతున్న వడ్డీల భారం
: కర్నూలు న్యాయరాజధానిగా మారుతుందని భారీగా కొనుగోళ్లు
: అందని ద్రాక్షగానే నంద్యాల జిల్లా
: విమానాశ్రయం వచ్చినా పెరగని ప్లాట్ల కొనుగోళ్లు..
: గృహ నిర్మాణ ముడిసరుకుల ధరలు పెరగడం కూడా ఓ కారణం
: ఇన్వెస్టర్లలో దడ..
: ఐపీ పెడుతున్న రియల్ వ్యాపారులు
కర్నూలు .. ప్రభన్యూస్ బ్యూరో : ప్రతి మనిషి నివసించేందుకు గూడు అవసరం, అందుకు తమ స్థాయికి తగ్గట్లుగా ఇళ్లు నిర్మించికోవాలని కలలు కనడం సహజం. ఈ క్రమంలో సొంతింటి కల నెరవేర్చేకునేందుకు తమ స్థాయిమేర పైసా,పైసా కూడ బెట్టుకొని తమ స్థోమతకు తగ్గట్లుగా భూమిని కొనడమో, లేదా అపార్టుమెంట్ రంగంపై మక్కువ పెంచుకోవడం జరుగుతుంది. అయితే నేడు విస్తరిస్తున్న పట్టణ సంస్కృతికి అనుగుణంగా రియల్ వ్యాపారం విస్తరించింది. ప్రజల అభిరుచికి అనుగుణంగా ఎన్నో రియల్ వ్యాపార సంస్థలు వెలిశాయి. కొన్ని సంస్థలు పాట్ల విక్రయాల పేరుతో ప్రజల ముందుకు వస్తుండగా, మరి కొన్ని సంస్థలు అపార్టుమెంట్ల నిర్మాణాల పేరుతో జనం ముందుకు వస్తున్నాయి. ఇలా విస్తరించిన రియల్ వ్యాపారంతో గడిచిన 10 ఏళ్లలో ఎన్నో గ్రామ పంచాయితీలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో పట్టణీకరణను తలపించే గృహాలు వెలిశాయి. మరికొన్నిచోట్ల వ్యవసాయ భూములు ప్లాట్‌లుగా మారాయి. దీంతో ఒక్కసారిగా రియల్ వ్యాపారం మాటున భూముల ధరలు పెరగడంతో ఇంటి స్థలం కొనుగోళ్లపై ప్రజలకు మక్కువ పెరిగింది. దీంతో సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావించిన ప్రతి ఒక్కరు ఇంటి స్థలాల కొనుగోలువైపు చూశారు. ఒకానొక దశలో ఇంటి స్థలాలకు ఉన్న డిమాండ్ కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఇంటి నివాసానికి అనుగుణమైన కాలనీల్లో సెంటు భూమి రూ. 2 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు చేరుకుంది. పేద, మధ్య తరగతి అభిరుచుకులకు అనుగుణంగా రియల్ వ్యాపారం ఊపందుకోగా, అందుకు అనుగుణంగా రియల్ వ్యాపార సంస్థలు వెలిశాయి. రియల్ వ్యాపారం జోరుగా సాగడంతో ఇటు ప్రభుత్వ ఆదాయం కూడ ఘణనీయంగా పెరుగుతూ వచ్చింది.
గడిచిన 4నెలల్లో బుల్‌లా దూసుకెళ్లిన రియల్ వ్యాపారం :ఈ క్రమంలో సెప్టెంబర్ వరకు జిల్లాలో రియల్ వ్యాపారం ఆకాశానికి ఎదిగింది. సాదారణ జీవితం గడుపుతున్న వ్యక్తులు కూడ రియల్ వ్యాపారంలో దిగి నాలుగురాళ్లు వెనుకేసుకున్నారు. గడిచిన 10 ఏళ్లలో ఎందరో రియల్ వ్యాపారులు అందనంత స్థాయికి ఎదిగారు. మార్కేట్‌లో రూ. లక్ష పలికే భూమి ధర రూ. 10 లక్షల నుంచి 20 లక్షలకు చేరుకుంది. ఇక నగరం, పట్టణ ప్రాంతంలో వీటి ధరలు అందనంత ఎత్తుకు ఎదిగింది. ఒక్క కర్నూలు నగర చుట్టు పరిధిలోనే ఎకర భూమి రూ. కోటీ నుంచి రూ.3 కోట్లకు చేరుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. కర్నూలును న్యాయ రాజధానిగా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడమే. వీటితో పాటు నగర పరిధిలో తుంగభ ద్ర, హంద్రీతో పాటు ఎన్నో చెరువులు ప్రవహించడం, మరోవైపు నంద్యాలను జిల్లాగా చేయనున్నట్లు వెలువడిన ప్రకటన నేపథ్యంలో అక్కడ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. వీటితో పాటు చుట్టు పక్కల తెలుగుగంగా, ఎస్‌ఆర్‌బిసి, కుందు నదులు ప్రవహించడం ధరల పెరుగుధలకు ప్రధాన కారణం. నంద్యాల సమీప ప్రాంతంలో ఎకరా రూ. 5 లక్షలు పలికే భూముల ధరలు రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు కొంటున్నారు. కొందరు రియల్ వ్యాపారులైతే ఏకంగా టోకెన్ అడ్వాన్స్‌లు ఇచ్చి మరి తీసుకుంటున్నారు. మరి కొందరు తెలిసిన వారి వద్ద వడ్డీలకు తెచ్చుకొని ఎకరాలకు, ఎకరాలు కొనుగోళ్లు చేశారు. నంద్యాలలో ముఖ్యంగా ఆళ్లగడ్డ, పాణ్యం, మహానంది, నందికొట్కూరు, రైతు నగర్ వైపు భూములకు, ఇళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిబందనలు తుంగలో తొక్కి రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యంగా వెంచర్లు వెలిశాయి. అందమైన ప్రకటనలు, అకర్షణీయమైన బ్రోచర్లతో 24 గంటల విద్యుత్, ఆట వస్తువులు, చక్కటి రోడ్లు, పూల మొక్కలు, అహ్లాధకరమైన వాతవరణం అని కొందరు, మరికొందరు హైవే సమీపం, కళాశాలలు, వైద్యశాలలు వస్తాయని నమ్మబలుకుతున్నారు.
ఒక్కసారిగా పతనమైన రియల్ వ్యాపారం : ఇదిగో .. అదిగో వస్తుంది అంటూ ఇప్పటికే ఏళ్లు గడుస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని కర్నూలు నగరంలో జాతీయ రహాదారిపై అయితే ఏకంగా 50 లక్షల నుంచి రూ. కోటీ వరకు పలికినవి లేకపోలేదు. రెండేళ్ల క్రితం కర్నూలు జగన్నాథ గట్టును న్యాయ రాజధానిగా చేస్తామని ప్రకటన వెలువడగా, ఇక నంద్యాలను జిల్లాగా చేస్తామని సర్వేలు చేయడంతో రియల్ వ్యాపారులతో పాటు సామాన్యులు, అన్ని వర్గాల వారు రియల్ వ్యాపారంలో దిగారు. కొందరు వ్యాపారులు అప్పట్లో స్థలాలు కొనుగోలు చేసి చేతులు మార్చడంతో రూ. లక్షల ఆదాయంను కళ్లచూశారు. ఆశకు అంతం లేకుండా పోయింది. ఇంట్లో ఉన్నవి, బయట నుంచి డబ్బులు తీసుఒకి వచ్చి ఖాళీ స్థలంతో పాటు, ఎక్కడ భూములు కనబడితే ఇష్టా రాజ్యంగా తాహాతుకు మించి కొనుగోలు చేశారు. చాల మంది టోకేన్ అడ్వాన్స్‌లు చెల్లించారు. తీరా భూముల ధరలు పెరగడంతో కొనుగోలు సన్నగిల్లాయి.
ఐపిలతో పలాయనం : ఇదే క్రమంలో కరోనా మహ్మామారి ఒకవైపు, మరోవైపు ఇళ్ల ముడి సామగ్రి ధరలు పెరగడంతో రియల్ వ్యాపారం సన్నగిల్లింది. వడ్డీలు తడిసిమోపెడవుతున్న స్థలాల అమ్మకాలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇదే సమయంలో వడ్డీ వ్యాపారులు అన్ని గ్రహించి వడ్డీలకు తీసుకున్న రియల్ వ్యాపారులపై వత్తడీలు పెంచారు. స్థాయికి మించి అప్పులు చేసి వ్యాపారాలు కనుచూపుమేర లేకపోవడంతో కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక, వడ్డీలు కట్టలేక కొందరు ఊరు విడిచిపారిపోతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు నగరంలోని బిర్లా కాంపౌండ్‌లో గల ఇతినా రియల్ ఎస్టేట్ సంస్ధ యాజమాని రూ.150 కోట్లు ఐపి పెట్టినట్లు విసృత స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ సంస్థతో లావాదేవీలు కలిగిన ఎందరో పోలీసులను ఆశ్రయించారు. ఇలా రియల్ వ్యాపారుల అంచనాలు తారుమారయ్యాయి. దీంతో రియల్ వ్యాపారులపై అధారపడ్డ ఇన్వేష్టర్ల పరిస్థితి దయనయంగా మారింది. సాధారణంగా రియల్ వ్యాపార ఇన్వేస్టర్ ఎవరైన సరే తమ వ్యాపారంకు అవసరమైన మూల ధనంను ఎక్కువగా బ్యాంకుల నుంచి లేదా వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకోవడం అనవాయితీ, కరోనా కాలంలో రియల్ వ్యాపారం కుప్పకూలడంతో తీసుకున్న ధనానికి వడ్డీ తడిచి మోపడవ్వడంతో ఏమి పాలుపోలేని స్థితిలో కొందరు వ్యాపారులుండగా, కొందరైతే ఏకంగా ఐపి పెట్టే అలోచనలో లేకపోలేదు. మరి కొందరైతే ఖర్చులను తగ్గించే క్రమంలో ఇప్పటికే తమ సిబ్బందిని వీలైనంతగా తగ్గించారు. ఇప్పటికే నగరంలో ఓరియల్ వ్యాపారి రూ. 300 కోట్లకుపైగా కుచ్చుటోపి హైదరబాద్‌కు ఉడాయించారు. రియల్ వ్యాపారంకు అనుగుణంగా వ్యాపారి వద్ద భూములు ఉన్నా, వాటిని కొనేందుకు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో రియ ల్ వ్యాపారం అచేతన స్థితిలో పడింది. ఇక నంద్యాలలో ఒకరిద్దరు రియల్ వ్యాపారులు తీసుకున్న డబ్బులకు వడ్డీలు చెల్లించలేక ఆత్మహాత్యకు పాల్పడగా, వడ్డీలు చెల్లించకపోవడంతో ఒకరిద్దరిని వడ్డీ వ్యాపారులు కిడ్నాఫ్‌లు చేసి వారి ఆస్ధులను తనఖా చేసుకోవడమో, లేదా తమ పేరిన నమోదు చేసుకున్న ఘటనలు లేకపోలేదు. ఇలా ఎందరో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయలు వడ్డీలకు తీసుకున్నట్లు సమాచారం. రియల్ వ్యాపారం డమాల్ కావడంతో వడ్డీ వ్యాపారుల నుంచి తీవ్ర వత్తిడీలు అధికమవుతున్నాయి. పట్టనంలో వ్యాపారులు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వార ందరిలో సైతం కలవరం మొదలైంది కొట్టు పెట్టి కొన్న స్థలాలు ఒక్కసారిగా పతనం కావడంతో దిక్కుతోచని పరిస్తితిలో పడ్డారు. కొందరి కైతే భూములపై టోకన్ అడ్వాన్స్‌గా ఇచ్చినా సోమ్ము కూడ రాకుండా పోతుందని ఆందోళన తప్పడం లేదు. ఏది ఏమైనా జిల్లాలో ఒక్కసారిగా రియల్ వ్యాపారం డమాల్ అనడంతో అటు వ్యాపారుల్లో, ఇటు వడ్డీ వ్యాపారులో అలజడి మొదలైంది.
రియల్ ఢమాల్..
Advertisement
తాజా వార్తలు
Advertisement