రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. దీంతో ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు పెరగడం నాలుగోసారి కావడం గమనార్హం. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేట్ 5.40 నుంచి 5.90 శాతానికి పెరిగింది. కాగా, గడిచిన ఐదు నెలల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగింది. రెపో రేట్ పెరగడం వలన గృహా, వాహన రుణాల వడ్డీ రేట్లు పెరగనున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
ద్రవ్యోల్బణం భయాలతో వడ్డీ రేట్లను పెంచడం ఆర్‌బీఐకి అనివార్యంగా మారింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు సమావేశమైన రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ శుక్రవారం తన నిర్ణయాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆర్థిక వృద్ధిపై శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకే అమెరికాలో కూడా వడ్డీ రేట్లను భారీగా పెంచింది యూఎస్ ఫెడ్.