ఆర్బీఐ మరోసారి వడ్డీ రేట్లు పెంచింది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్లను ఆర్బీఐ పెంచింది. దీంతో హోమ్ లోన్, వాహనాల లోన్ల వడ్డీ రేట్లు పెరగనున్నాయి. వడ్డీ రేట్ల పెంపు భారం భారీగా ప్రజలపై పడనుంది. ఆర్‍బీఐ ఈ ఏడాది రెండుసార్లు రెపో రేట్ పెంచింది. మే 4న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆకస్మికంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ రెపో రేట్ 40 బేసిస్ పాయింట్స్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత జూన్ 8న మరోసారి ఆర్‌బీఐ రెపో రేట్ పెంపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 8న ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. అంటే మొత్తం 140 బేసిస్ పాయింట్స్ వడ్డీ పెరిగింది. అంటే 1.40 శాతం వడ్డీ పెరిగింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement