Tuesday, November 26, 2024

ఆర్బీఐ వ‌డ్డీ రేట్ల‌పై శ‌క్తికాంత‌దాస్ ఏమ‌న్నారంటే ..

ఒమిక్రాన్ వేళ ఆర్బీఐ వ‌డ్డీ రేట్లు ఎలా ఉంట‌యోన‌ని దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఆర్బీఐ మానిట‌రీ పాల‌సీ క‌మిటీ రిపోర్ట్ ను తెలియ‌జేసింది. కాగా ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంతదాస్ మీడియాతో మాట్లాడారు.. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు ఆర్బీఐ. రెపోరేటు, రివర్స్ రెపోరేట్లను యధాతథంగా ఉంచారని చెప్పారు. రెపో రేటను 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును 3.35 శాతంగా, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా ఉంచాల‌ని మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయించిందని శక్తికాంతదాస్ తెలియ‌జేశారు.

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించ‌డం వ‌ల్ల ద్ర‌వ్యోల్బ‌ణం అదుపులోకి వ‌స్తుంద‌ని చెప్పారు. వరసగా తొమ్మిదో సారి కూడా రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను మార్చకుండా.. యధాతథంగా ఉంచారు. పెట్రోల్, డిజిల్ ధరలు తగ్గించడం వల్ల.. వాటి డిమాండ్ పెరిగిందని శక్తికాంతదాస్ వెల్ల‌డించారు. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, కోవిడ్ సంక్షోభాన్ని ఎదురుకోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. 2022 వార్షిక సంవత్సరం నాటికి జీడీపీలో వృద్ధి రేటు టార్గెట్ 9.5 శాతంగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement