Thursday, November 21, 2024

‘ఆర్‌బీఎల్‌’లో ఏం జరగబోతోంది ?

‘ఆర్‌బీఎల్‌’ బ్యాంకు ముఖ్యకార్యనిర్వాహకాధికారి(సీఈఓ) విశ్వవీర్ అహూజా తన పదవి నుంచి తప్పుకోవడంతో రిజర్వ్ బ్యాంకు అదనపు డైరెక్టర్ ను నియమించడం. ఈ పరిణామాల నేపధ్యంలో ఆర్‌బీఎల్‌పై అందరి ద‌ృష్టి మళ్ళింది. రత్నాకర్ బ్యాంకు లిమిటెడ్(ఆర్‌బీఎల్)కు   బ్రాండ్ ఇమేజీ తెచ్చి, రూపురేఖలు మార్చిన సీఈఓ విశ్వవీర్ అహుజా.. తన బాధ్యతల నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. ఆయన రాజీనామాను బోర్డు కూడా అనుమతించింది. ఆ వెంటనే ఎగ్జ్సిక్యూటీవ్ డైరెక్టర్ గా ఉన్న రాజీవ్ అహుజాను ఇంటరెమ్ ఎండీ అండ్ సీఈఓగా నియమితులయ్యారు. విశ్వవీర్ అహూజా తప్పుకోవడం కార్పొరేట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం వయసు అడ్డంకి కాదు. ఆయన వయసు కేవలం 59 సంవత్సరాలు మాత్రమే. బ్యాంకులో ఆయనకు మంచి పేరుంది. బ్యాంకు విస్తరణలో ఆయన పాత్ర కీలకం. ఈ క్రమంలో ఆయన అనూహ్యంగా రాజీనామా చేయడం సంచలనంగా మారింది.

రిజర్వ్ బ్యాంకు ఎంట్రీతో..

ఆర్‌బీఎల్ కమ్యూనికేషన్ విభాగంలో జనరల్ మేనేజర్ గా పనిచేసిన యోగేష్ దయాళ్‌ను అదనపు డైరెక్టర్ గా ఆర్‌బీఎల్‌కు పంపారు. ఆయన నియామకం జరిగిన కొద్ది గంటల్లోలనే రత్నాకర్ బ్యాంక్ సీఈఓ అహుజా రాజీనామా చేశారు. దయాళ్ ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్‌లో కమ్యూనికేషన్ విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. సెంట్రల్ బ్యాంకర్‌గా తన 25 సంవత్సరాల అనుభవంలో దయాళ్ ఆర్‌బీఐ కు సంబంధించిన వివిధ కార్యాలయాల్లో మానిటరీ పాలసీ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ సూపర్‌విజన్‌ విభాగాలతో పాటు బెంగళూరు, న్యూఢిల్లీ, లక్నోల్లోని ప్రాంతీయ కార్యాలయాల్లో బ్యాంకింగ్ పర్యవేక్షణ విభాగాల్లో పలు పదవులను నిర్వహించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కరెన్సీ మేనేజ్‌మెంట్, చెల్లింపులు/సెటిల్‌మెంట్ సిస్టమ్ తదితర రంగాల్లో ఆయనకు అనుభవముంది. గతంలో దయాళ్ జే అండ్ కే బ్యాంక్ బోర్డ్‌లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు…

భయపడొద్దన్న బ్యాంకు ..

- Advertisement -

ఇన్వెస్టర్లకు భరోసానిస్తూ బ్యాంకు పనితీరుపై ప్రకటన వెలువడింది. ఎలాంటి భయాందోళనలూ అవసరం లేదని, కోవిడ్ మహమ్మారి కారణంగా సవాళ్ల తర్వాత వ్యాపారం/పెరుగుదల మెరుగ్గా ఉన్నాయని బ్యాంక్ ప్రత్యేకంగా పేర్కొంది. లిక్విడిటీ కవరేజ్ రేషిర్ 155 శాతం, ఇక ఎన్‌పీఏలు 2.14 శాతం మాత్రమే ఉన్నట్లుగా వెల్లడించింది. బ్యాంక్ తన డిపాజిట్లు/అడ్వాన్సుల గ్రాన్యులారిటీని కూడా మెరుగుపరుచుకుందని బ్యాంక్ వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement