రవితేజ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్, పోస్టర్లు సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమా నుంచి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం…
కాగా, మార్చి 1వ తేదీన ప్రత్యేకంగా టీజర్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది సినిమా టీమ్. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నాడట. RT టీమ్‌వర్క్స్‌తో కలిసి SLV సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి తమిళ కంపోజర్ సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..