Saturday, November 23, 2024

రావ‌ణాసుర ఎలా ఉందంటే..

రావ‌ణాసుర ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ హీరోగా న‌టించాడు. మ‌రి ఈ థ్రిల్ల‌ర్ చిత్రం ర‌వితేజ‌కి విజ‌యాన్ని అందించిందా లేదా ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

క‌థ ఏంటంటే.. క్రిమినల్ లాయిరే క్రిమిల్ అయితే అనే పాయింట్ చుట్టూ అల్లిన కథ ఇది. క్రిమినల్ లాయిర్ రవీంద్ర( రవితేజ)…కనకమహాలక్ష్మీ (ఫరియా అబ్దుల్లా) వద్ద జూనియర్ గా పనిచేస్తుంటాడు.ఇక సిటీలో వరసగా హై ప్రొఫైల్ మర్డర్స్ జరుగుతూంటాయి. కానీ హత్యలు చేసి రెడ్ హ్యాండెండ్ గా పట్టుబడిన వాళ్లు తాము ఈ హత్యలు చేయలేదని, అసలు ఆ టైమ్ లో తాము కాన్షస్ లో లేమని చెప్తూంటారు. ఈ కేసులు రవీంద్ర దగ్గరకు వస్తూంటాయి. మరో ప్రక్క సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ హత్యల వెనుక రవి హస్తం ఉందని ఏసీపీ హన్మంతు (జయరామ్) కు డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. మరో ప్రక్క హోం మినిస్టర్ (రావు రమేష్) హత్యకు కూడా ప్లానింగ్ జరుగుతూంటుంది. అసలు ఎవరు ఈ హత్యలు చేస్తున్నారు. రవీంద్రకు ఈ హత్యలకు సంభందం ఏమిటి… హోం మినిస్టర్ ని చంపేసారా…ట్రైలర్ లో చూపించినట్లు రవితేజ నెగిటివ్ క్యారక్టరా…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -

విశ్లేషణ.. రవితేజ వంటి మాస్ హీరో నుంచి ఏ సినిమాలు ఆశిస్తారో అవి రావ‌ణాసుర‌లో కనపడకపోవటం నిరాశని తెప్పించింది. ఇప్పుడీ సినిమాలో కూడా రవితేజ క్రైమ్ థ్రిల్లర్ దారిలో వెళ్లాలనే ప్రయత్నం చేసారు. అదేమీ పొరపాటు కాకపోయినా క్రైమ్ థ్రిల్లర్స్ ని ఓటిటిలతో అటు వంటి సినిమాలు ఎన్నో చూసేసిన ప్రేక్షకుడుని మెప్పించటం మాత్రం మామూలు విషయంకాదు. ఎంత కసరత్తు చేసి కథ వండినా తన ఎక్సపెక్టేషన్స్ కు మించిన థ్రిల్స్ లేకపోతే ..ఆ ..కంటెంట్ లేదనిపిస్తుంది. ఇవన్నీ తెలియకా కాదు రవితేజ వంటి సీనియర్ కు. తన అభిరుచికి తగ్గ కథను వండి వడ్డించాలనుకున్నాడు. వాడు క్రిమినల్ లాయర్ కాదు… లా చదివిన క్రిమినల్’ – అంటూ ఈ సినిమాలో వచ్చే డైలాగులో మొత్తం కథ ఉంది. విన్సీడా అనే బెంగాలీ సినిమాను బేస్ చేసుకుని రావణాసుర చిత్రాన్ని చేసారు. అందులో మెయిన్ పాయింట్ ని తీసుకుని ,మిగతాది అంతా తెలుగు కమర్షియల్ ఫార్మెట్ లో కథ అల్లి అందించారు. అయితే ఈ ప్రాసెస్ లోనే కథ,కథనం రెండూ దెబ్బ తిన్నాయి. ఫస్టాఫ్ లోనే కీ పాయింట్ రివీల్ అవటంతో మిగతాది అంతా ప్రెడిక్టబుల్ గా సాగింది. అలాగే ఎక్కడా కాంప్లిక్ట్ స్టైయిట్ గా ఉండదు. ఏ సీన్ కా ఆ సీన్ కాంప్లిక్ట్ చూసుకున్నారు. ఓవరాల్ గా కథలో కాంప్లిక్ట్ అంటే హీరో సమస్యలో పడటం అనేది ఉండదు. అలాగే విలన్స్ యాక్టివేట్ అవటానికి ఫలానా వాళ్లు తమని చంపుతున్నారనే విషయం తెలియదు. అలా నెగిటివ్ క్యారక్టర్స్ ఉన్నా..అవి హత్యకు గురి అవ్వటం తప్పించి చేసేదేమీ ఉండదు. కేవలం ప్రేక్షకులు థ్రిల్ అవుతారు ఈ ట్విస్ట్ లకు అని స్క్రీన్ ప్లే రాసుకున్నారు కానీ రవితేజ వంటి స్టార్ కు తగ్గ కథ ఇది అనుకుని ట్రీట్మెంట్ చేయలేదు.

టెక్నికల్ ..డెరెక్ట‌ర్ సుధీర్ వర్మ సినిమాలు టెక్నికల్ గా బాగుంటాయి. కథ,కథనం పరంగా నీరసంగా ఉంటాయి. ఇక్కడా అదే జరిగింది. హర్షవర్ధన్ రామేశ్వర్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం బ్రిలియంట్ గా వుంది. హర్షవర్ధన్‌తో పాటు, భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లు అందించారు.పాటలు యావరేజ్ గా ఉన్నాయి.నవీన్ నూలి ఎడిటింగ్ ..సెకండాఫ్ ని మరింత టైట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. డైలాగులు జస్ట్ ఓకే. స్క్రీన్ ప్లే మాత్రం అసలు వర్కవుట్ కాలేదు.

నటీనటులు .. రవితేజ ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. కామిక్ టైమింగ్ ని పెద్దగా వాడలేదు. ఉన్న కొన్ని సీన్స్ పేలలేదు. అయితే రవితేజ డార్క్ షేడ్స్ క్యారక్టర్స్ కూడా బాగా చేయగలరని చెప్పుకోవటానికి చేసినట్లు ఉంది. ఈవిల్ స్మైల్ గమ్మత్తుగా ఉంది.సుశాంత్ ది ఫుల్ లెంగ్త్ క్యారక్టరే కానీ మామూలుగా చేసుకుంటూ పోయారు. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు కానీ ఎవరూ పెద్దగా గుర్తు ఉండరు. మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ మరియు అను ఏమాన్యూల్ తమ పరిధుల్లో బాగానే చేసారు. హైపర్ ఆది కామెడీ ట్రై చేసాడు. అక్కడక్కడా వర్కవుట్ అయ్యింది. సంపత్ రాజ్, మురళీ శర్మ, జయ రామ్ వంటి సీనియర్ రొటీన్ గా చేసుకుంటూ పోయారు. రీమేకో, ఫ్రీ మోకో ఏది చేసినా ఇక్కడకు అది మనం కొత్తగా ఫీలవుతామో లేదో చూసుకోవాలి. మొత్తానికి ఈ చిత్రం హిట్ట‌ని చెప్ప‌లేం..అలా అని ఫ‌ట్ట్ అని చెప్ప‌లేం అన్న‌ట్లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement