ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణంలోని రవళి సెల్ పాయింట్ ఆధ్వర్యంలో బుధవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా బంపర్ డ్రా నిర్వహించారు. ఈ బంపర్ డ్రాలో ప్రథమ బహుమతి పొందిన కరకగూడెం మండలం తాటిగూడెంకు చెందిన పోలెబోయిన వెంకటనారాయణకు హోండా యాక్టివా ద్విచక్ర వాహనాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఐ ముత్యం రమేష్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రవళి సెల్ పాయింట్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సందర్భంగా వంద రోజుల బంపర్ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాల్గవ బహుమతులు పొందిన విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సెల్ పాయింట్ నిర్వాహకులు పసునూరి రాము, యాదగిరి రామారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా తమను ఆదరిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తున్న నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో.. కేవలం ఒకే ఒక షాపుతో ప్రతీ సంవత్సరం ఏజెన్సీ ప్రజలకు సేవ చేసుకునేందుకు తమ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో ప్రజలందరి పూర్తి సహకారాలు తమకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో లోకేష్, వెంకటేశ్, రామకృష్ణ, హేమంత్, ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు.