Friday, November 22, 2024

అందరికీ రేషన్‌.. ఇళ్ల స్థలాలు.. కొత్త డేటా బేస్ ఏర్పాటు చేస్తున్న కేంద్రం..

ఆహార ధాన్యాలను పొందడానికి రేషన్‌ కార్డు ఎంతో ముఖ్యం. రేషన్‌ పొందడానికి అవసరమైన పత్రాలు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నిరాశ్రయులు, నిరుపేదలు చౌకగా లభించే ఆహార ధాన్యాలు పొందడం లేదు. రేషన్‌ కార్డుల్లేని వారు కూడా ప్రయోజనాలు పొందేందుకు వీలుగా వారి డేటాను సేకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. డేటాతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. జనాభాలోని ఈ పేద, మధ్య తరగతి ప్రజలను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇళ్ల స్థలాలను కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నది.

వారికి గుర్తింపు కార్డు లేకపోవడం, ఇంటి చిరునామా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. ఇళ్లు లేని నిరుపేదలకు సంబంధించిన ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించనున్నారు. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద రేషన్‌ కార్డులు ఉన్న 81 కోట్ల మందికి పైగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా ప్రభుత్వం రేషన్‌ అందిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement