Monday, November 18, 2024

రేషన్ సరుకులు తీసుకోవడం లేదా.. అయితే కార్డు ఉందో లేదో చెక్ చేసుకోండి..

రేషన్ కార్డు ఆధారంగా పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందిస్తుంది. రేషన్ కార్డు తయారు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో వారి జాబితాను అప్‌డేట్ చేయడం ద్వారా కార్డులు జారీ చేస్తారు. ఈ విషయంలో ఏదైనా ఆటంకం ఉంటే రద్దు చేయబడుతుంది. రేషన్ కార్డును ఎక్కువ కాలం ఉపయోగించకపోతే కూడా రద్దు అవుతుంది. .

ఎక్కువ కాలం ఉపయోగించకుంటే..
ఏ నెలలో ఎంత రేషన్ తీసుకున్నారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నారు? అలాంటి సమాచారం అంతా రేషన్ కార్డులో ఉంటుంది. మీ పేరు మీద రేషన్ కార్డు ఉంటేనే మీరు బియ్యం, చక్కెర, గోధుమలు తీసుకోగలుగుతారు. ఎక్కువ కాలం ఉపయోగించని రేషన్ కార్డులు రద్దు అవుతాయి.

రూల్స్ ఏమిటంటే?
సివిల్ సప్లయీస్ విభాగం ప్రకారం, రేషన్ కార్డుదారుడు ఆరు నెలలుగా రేషన్ తీసుకోకపోతే అతనికి చౌకగా లభించే ఆహారం అవసరం లేదని.. రేషన్ తీసుకోవడానికి అర్హత లేదని భావిస్తారు. ఈ సందర్భంలో ఆరు నెలల పాటు రేషన్ తీసుకోని వ్యక్తి రేషన్ కార్డు రద్దు చేస్తారు. రేషన్ కార్డు రద్దు అయితే దాన్ని తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం AePDS అధికారిక వెబ్‌సైట్‌లో మళ్లీ రీ యాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement