Saturday, November 23, 2024

ర‌త‌న్ టాటా బ‌ర్త్ డే – ఆయ‌న చెప్పిన కొటేష‌న్స్ ఇవే

గొప్ప గొప్ప‌వారి వెనుక కూడా ఎన్నో చేదు అనుభ‌వాలు, విషాదాలు, స‌వాళ్ళు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ర‌త‌న్ టాటా ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రేమో. నేడు ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొటేష‌న్స్ మీ కోసం. జీవితంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూసినా టాటా గ్రూపును బ‌లంగా నిల‌బెట్టారు. నాయ‌క‌త్వ మార్పిడిలో ఎన్నో స‌వాళ్ల‌ను అధిగ‌మించారాయ‌న‌. టాటాగ్రూపును అత్యంత సమ‌ర్థంగా న‌డిపించి ఆ ప‌గ్గాల‌ను స‌మ‌ర్థుడైన చంద్ర‌శేఖ‌ర్ కి అప్ప‌గించారు. తొలితరం పారిశ్రామికవేత్తగా ఆయన అనుభవ సారాన్ని కొటేషన్లే చెబుతాయి. నాయకత్వ మార్పిడి విషయంలో సైరస్ మిస్త్రీతో వివాదం నెలకొన్నా కానీ, గట్టిగానే పోరాడి తాను చేసింది సరైనదేనని నిరూపించారు.

‘మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎత్తు పల్లాలన్నవి ఎంతో ముఖ్యమైనవి. ఎత్తుపల్లాలు లేకుండా తిన్నగా సాగిపోతే.. ఈసీజీలోనూ ఇలాగే ఉంటే మనం జీవించి లేమన్నట్టే’ అన్నారు. సరైన నిర్ణయాలు అనే దానిని నేను నమ్మను. నేను నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని సరైన దారిలో నడిపిస్తానన్నారు ర‌త‌న్ టాటా. వేగంగా నడవాలని నీవు అనుకుంటే ఒక్కడివే ఆ పని చేయి. కానీ, చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం కలసి నడవాలి..ప్రజలు నీ మీద వేసే రాళ్లు స్వీకరించు. వాటిని ఉపయోగించి ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించు’.ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ దానంతట అదే తుప్పు పడుతుంది. అలాగే, ఎవరూ ఒకరిని నాశనం చేయలేరు. సొంత మనస్తత్వమే అలా చేయగలదు.నేను ఎవరినైనా బాధపెట్టి ఉండొచ్చు. కానీ, ఎలాంటి పరిస్థితిలోనైనా రాజీపడకుండా నా వంతు మెరుగ్గా పనిచేసిన వ్యక్తిగా నన్ను నేను చూడాలనుకుంటాను.నేను ఎగరలేని రోజు విషాద దినమే నాకు. సీరియస్ గా ఉండకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా ఆస్వాదించాలి.ఇతరులను కాపీ కొట్టే వ్యక్తి కొంత వరకు విజయం సాధించొచ్చు.. కానీ, ఆ తర్వాత అతను మరింత విజయం సాధించలేడ‌ని పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement